:: Welcome to NRI - Article ::

ధృవ కలెక్షన్లను ఒక్కరోజులో సాధించిన చిరు

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ థియేటర్లలో సందడి చేస్తోంది. అన్నిచోట్లా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే బాహుబలి, పీకే వంటి సినిమాల ప్రీమియర్ షోల రికార్డులను బ్రేక్ చేసిన ఖైదీ.. బాక్సాఫీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 9న రామ్ చరణ్ సినిమా ధృవ విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటివరకూ ఓవరాల్‌గా ఇప్పటివరకూ అమెరికాలో 1.45 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే జనవరి 11 వరకు మొత్తం 33 రోజులకు గానూ ఈ కలెక్షన్లు వచ్చాయన్నమాట.  సినిమా విడుదలకు ముందు నుంచే అమెరికాలో ఉండి అభిమానులతో ప్రీమియర్ షోలు చూసి రామ్ చరణ్ విపరీతంగా ప్రమోషన్ ఇచ్చాడు. అందుకే మొట్టమొదటి సారి చరణ్ సినిమా లక్ష మిలియన్ డాలర్లు మార్కు దాటింది. 

అయితే ప్రస్తుతం చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా ఓవర్సీస్‌లో దుమ్మురేపుతోంది. ప్రీమియర్ షోల ద్వారానే 1.30 మిలియన్ డాలర్లు దాటేసిందనీ, ఇంకా చాలా థియేటర్ల నుంచి కలెక్షన్ల వివరాలు రావాల్సి ఉందనీ, ఈ లెక్కన మొత్తం 1.50 మిలియన్ డాలర్లకు మేర ప్రీమియర్ల ద్వారా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ప్రీమియర్ల షోల ద్వారానే లక్ష మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టిన పీకే, బాహుబలి సినిమాలను కూడా చిరంజీవి సినిమా దాటేసిందని చెబుతున్నారు. ఈ లెక్కన తనయుడు రామ్ చరణ్ సినిమా ధృవ ఓవరాల్ కలెక్షన్ల మొత్తం 1.45 మిలియన్ డాలర్లను.. చిరంజీవి సినిమా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే కొల్లగొట్టిందన్నమాటు. ఏది ఏమైనా మెగాస్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్‌కు తెలిసొచ్చిందంటూ చిరు అభిమానులు సంబరపడుతున్నారు.