:: Welcome to NRI - Article ::

కార్తీకి ‘కాష్మోరా’ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తుందో

‘యుగానికి ఒక్కడు,ఆవారా,నా పేరు శివ,శకుని’ వంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కార్తీ. ఈ హీరో తాజా చిత్రం ‘కాష్మోరా’.కార్తీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన హిస్టోరికల్ చిత్రమిది. ఈ సినిమాలో కార్తీకి జోడిగా నయనతార,దివ్యనటించారు.ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులు అంచనాలను రెండింతలు పెంచింది.ఈ సినిమాపై తెలుగు,తమిళ ప్రేక్షుకలతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

కార్తీ,నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊపిరి’ సినిమా ఓవర్సీస్‌లో మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో ‘కాష్మోరా’ ఓవర్సీస్‌ హక్కుల పెద్ద మొత్తానికి అమ్ముడుపోయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఓవర్సీస్‌లో సుమారు 50 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మరీ కాష్మోరా సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో వేచిచుడాల్సిందే..