kala-record-breaking-at-boxoffice-

'కాలా'కు మొదటి రోజే రికార్డు కలెక్షన్లు

రజనీకాంత్ సినిమా విడుదల కోసం సగటు సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తుంటారో కొత్తగా చెప్పక్కర్లేదు. గతంలో ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాయి. అందువల్లే రజనీ సినిమాలకు అంతటి క్రేజ్ ఏర్పడింది. రజనీ కొత్త సినిమా 'కాలా' కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. పా రంజిత్ దర్శకత్వంలో  ప్రముఖ హీరో స్వయనా రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాను నిర్మించడం విశేషం.

అయితే 'కాలా' విడుదలైన మొదటి రోజే 50 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమర్ సందు తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా రజినీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమా విడుదలవుతుందంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అంచనాలను అందుకుని 'కాలా' ఈ కలెక్షన్లను రాబడుతోందని ఉమర్ చెప్పాడు. ముఖ్యంగా మలేషియా, తమిళనాడు, తూర్పు ఆసియా దేశాల్లో 'కాలా' దూసుకుపోతోందని ఉమర్ చెబుతున్నాడు.