Jai-Simha-Overseas-Review-by-Audience

జై సింహా.. ఓవర్సీస్ రివ్యూ..

నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జై సింహా’.. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. బాలయ్య- నయనతార కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ‘జై సింహా’కు చిరంతన్ భట్ అందించిన సంగీతం ఇప్పటికే అభిమానులను అలరించింది. ఈ సినిమాలో హరిప్రియ, నటాషా దోషి కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరాం, అశుతోష్ రానా, మురళీమోహన్, జయప్రకాశ్ రెడ్డి ఇతర భారీ తారాగణంతో వచ్చిన ఈ  సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అమెరికాలో ఓ రోజు ముందుగానే గురువారమే ప్రీమియర్ల ద్వారా విడుదలయిన ఈ సినిమాకు ఎన్నారై సినీ అభిమానుల నుంచి మంచి టాక్ సంపాదించింది. 

బాలయ్యకు.. ఆ బాబుకు అసలు సంబంధం ఏమిటి..? ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్‌ను ఎందుకు వదులుకోవాల్సి వస్తుంది..? వైజాగ్‌ నుంచి కుంభకోణానికి చిన్న బాబుతో బాలయ్య ఎందుకు వెళ్తాడు..? వంటి అంశాలతో ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా ఉందని ఎన్నారైలు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే అమ్మకుట్టి సాంగ్, బ్రాహ్మిణ్ వర్గానికి సంబంధించిన సీన్ హైలెట్‌గా ఉంటాయని చెబుతున్నారు. బ్రహ్మానందం కామెడీ అక్కడక్కడా నవ్విస్తుందట. అసలు కథేంటో రివీల్ చేయకుండా ఫస్ట్‌హాఫ్‌ను కామెడీ, సస్పెన్స్‌, మాస్ ఎలిమెంట్స్‌తో నడిపించి.. సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బాగా నడిపించారట. రామ్- లక్ష్మణ్ ఫైట్స్, చిరంతన్ భట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎం.రత్నం అందించిన కథ, డైలాగ్స్ అన్నీ సూపర్‌గా ఉన్నాయని చెబుతున్నారు. సినిమాలో మేజర్ హైలెట్‌గా ‘అమ్మకుట్టి’ సాంగ్‌ను చెబుతున్నారు. దుబాయిలో చిత్రీకరించిన  ఆ సాంగ్‌లో బాలయ్య స్టెప్స్, మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తాయట. సంక్రాంతికి ఫ్యామిలీతో సహా వెళ్లి చూడదగిన కుటుంబ కథా చిత్రంగా, బాలయ్య అభిమానులకు పండుగను ముందే తెచ్చిన సినిమాగా ‘జై సింహా’ ఉంటుందని చెబుతున్నారు.