Jai-Simha-First-day-collections

జై సింహా.. మొదటి రోజు కలెక్షన్లు

బాలకృష్ణ- నయనతార కాంబినేషన్‌లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జై సింహా సినిమాకు మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా.. సినీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా సరిగమ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్లో 84 లొకేషన్లలో జై సింహా విడుదలయింది. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా ఒక లక్షా 7వేల 512 డాలర్లను కలెక్ట్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి జై సింహా సినిమాకు 10.25 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా బాలయ్య గత సినిమా పైసా వసూల్ కంటే తక్కువే కలెక్షన్లను జై సింహా నమోదు చేసింది.  పైసా వసూల్‌కు మొదటి రోజు రూ.11.40 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. బాలయ్య కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్‌డే కలెక్షన్లు సాధించిన సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి నిలిచింది. ఈ సినిమాకు 18 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో కూడా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు మొదటి రోజు 3 లక్షల 63వేల డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. జై సింహాకు మాత్రం ఓవర్సీస్‌లో ఒక లక్షా 7వేల 512 డాలర్లు వచ్చాయి.