:: Welcome to NRI - Article ::

కలెక్షన్లతో దూసుకెళ్తున్న జై లవకుశ

ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తన అన్నయ్య కల్యాణ్‌రామ్ నిర్మాతగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి నటించడం, అందులోనూ ఫస్ట్ టైమ్ త్రిపాత్రాభినయం చేయడం, వాటిల్లో ఓ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉండటంతో విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా సూపర్ హిట్‌ టాక్‌‌ను అందుకుని కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ సినిమాలో జై పాత్రకు అభిమానులు, ప్రేక్షకుల నుంచే కాదు, సినీ వర్గాల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

 
అమెరికాలో యూఎస్ తెలుగు మూవీ డిస్ట్రిబ్యూషన్‌లో సెప్టెంబర్ 19న విడుదలయిన జై లవకుశ.. రెండు వారాలు గడిచినా కలెక్షన్లు బాగానే వస్తున్నాయని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా మూడో వారంలో గురువారం వరకు మొత్తం 15 లక్షల 45వేల 37 డాలర్లను (10 కోట్ల 12 లక్షల రూపాయలు) కలెక్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. మూడో వారంలో సోమవారం 2వేల 462 డాలర్లు, మంగళవారం 11వేల 58 డాలర్లు, బుధవారం 2వేల 796 డాలర్లు, గురువారం ఒక వెయ్యి 900 డాలర్లను కలెక్ట్ చేసి మొత్తం 15 లక్షల 45వేల 37 డాలర్లను కలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. గురువారం వరకు అంటే మొత్తం 16 రోజుల్లో 15.45 మిలియన్ డాలర్లను కలెక్టి చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు 150 కోట్ల రూపాయలకు చేరుకుందని తెలుస్తోంది.