:: Welcome to NRI - Article ::

రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న జై లవకుశ

మొట్టమొదటిసారి త్రిపాత్రాభినయం చేసి.. కెరీర్‌లో బెస్ట్ హిట్ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలయిన ‘జై లవకుశ’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. జై క్యారెక్టర్‌తో మాస్ వర్గాలను, లవ, కుశ క్యారెక్టర్లతో క్లాస్‌ను మెప్పిస్తూ.. సెంటిమెంట్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. నివేథా థామస్, రాశీఖన్నా హీరయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. రావణుడిగా ఎన్టీఆర్‌ను మలిచిన దర్శకుడు బాబీపై అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొడుతోంది. 

అమెరికాలో ‘యూఎస్ తెలుగు మూవీస్’ డిస్ట్రిబ్యూషన్‌లో 180కి పైగా స్క్రీన్లలో విడుదలయిన ఈ సినిమా.. పలు రికార్డులను బ్రేక్ చేసింది. అమెరికాలో హయ్యస్ట్ ప్రీమియర్ షోల కలెక్షన్లు సాధించిన సినిమాల్లో టాప్-5గా జై లవకుశ నిలిచింది. అమెరికాలో బుధవారం ప్రీమియర్లకు 5లక్షల 89వేల 390 డాలర్లు కలెక్ట్ అవగా.. గురువారం ఒక లక్షా 44వేల 894 డాలర్లు వచ్చాయి. మొత్తం మీద ప్రీమియర్లు ప్లస్ మొదటి రోజు కలెక్షన్లతో 7 లక్షల 34వేల 284 డాలర్లను (4 కోట్ల 76 లక్షల రూపాయలు) కొల్లగొట్టింది. ఈ వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించడంతో వీకెండ్‌లో కలెక్షన్లు భారీగానే వచ్చే అవకాశం ఉందని ఓవర్సీస్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ సినిమాకు మొదటి రోజు 47 కోట్ల 25 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 32.10 కోట్లు, కర్ణాటకలో 5.67 కోట్లు, తమిళనాడులో 0.72 కోట్లు, అమెరికాలో 4.76 కోట్లు, యూఏఈ, దుబాయి, కువైట్, ఆస్ట్రేలియా, లండన్.. వంటి దేశాలన్నీ కలిపి మరో 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజు 47.25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్ సినిమాగా నిలిచింది.