:: Welcome to NRI - Article ::

దుమ్మురేపుతున్న ‘జై లవకుశ’ కలెక్షన్లు

ఓ హిట్ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ‘జై లవకుశ’ సినిమా నిరూపిస్తోంది. గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమైన ఆదరణ లభిస్తోంది. మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసి మెప్పించిన తారక్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. తారక్ అభిమానులే కాకుండా సగటు సినిమా అభిమాని కూడా వారెవ్వా తారక్ అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద చిత్రం చేస్తున్న సందడే ప్రేక్షకుల ఆదరిస్తున్న తీరును తెలియజేస్తోంది. 
 
విడుదలైన మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.25 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదేస్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. అమెరికాలో కూడా రెండు రోజుల్లోనే 1 మిలియన్ మార్కును చేరుకుని రికార్డు సృస్టించింది. ఈ విషయాలను ఎన్టీఆర్ ఆర్ట్స్ మార్కెటింగ్ అండ్ పీఆర్ మహేష్ కోనేరు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద తారక్ స్టామినా ఏంటో మరోసారి రుజువైందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రేంజ్‌లో కలెక్షన్లు ఉంటే 100 కోట్ల మార్కును చేరుకోవడం చాలా ఈజీ అని సంబరపడుతున్నారు. ఇదిలావుండగా చిత్రానికి లభిస్తున్న ఆదరణ పట్ల చిత్రయూనిట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ట్వీట్టర్ ద్వారా తారక్ తెలిపిన సంగతి తెలిసిందే.