:: Welcome to NRI - Article ::

నితిన్ సినిమాలో విదేశీ నటుడు

 హీరో నితిన్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. జూన్ రెండో వారం వరకూ ఆయన అక్కడే ఉంటారు. గెటప్‌ పరంగా, కేరెక్టర్‌ పరంగా ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నించే నితిన్ ఈసారి ‘లై’ చిత్రం కోసం గడ్డం పెంచుకొని కొత్తగా కనిపిస్తున్నారు. ‘ఎల్‌..ఐ..ఇ.’ పదానికి ఓ కొత్త అర్థం చెబుతున్నారు దర్శకుడు హను రాఘవపూడి. ఎల్‌ అంటే లవ్‌, ఐ అంటే ఇంటెలిజెన్స్, ఇ అంటే ఎనిమిటి అని. మరో విషయమేమిటంటే హాలీవుడ్‌ నటుడు డాన్ బిల్జిరియాన్ ఈ సినిమాలో ఓ పాత్ర పోషిస్తుండటం. ‘ది అదర్‌ ఉమెన్’, ‘కాట్‌ రన్ 2’, ‘వార్‌ డాగ్స్‌’ వంటి చిత్రాల్లో నటించిన డాన్ తమ సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉందని నితిన్ ట్వీట్‌ చేశారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రం తర్వాత హను దర్శకత్వంలో 14 రీల్స్‌ సంస్థ ‘లై’ చిత్రాన్ని నిర్మిస్తోంది. అమెరికాలోని వెగాస్‌, లాస్‌ ఏంజిల్స్‌, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతోంది. బుధవారం తన పుట్టినరోజు కావడంతో దర్శకుడు హను యూనిట్‌ సభ్యుల మధ్య జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర్‌ మాట్లాడుతూ ‘ప్రస్తుతం మా చిత్రం షూటింగ్‌ అమెరికాలోని వివిధ లొకేషన్స్‌లో నానస్టాప్‌గా జరుగుతోంది. అమెరికా షెడ్యూల్‌తో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసున్నాం. నితిన్ సరసన మేఘా ఆకాశ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్‌ బోయనపల్లి సమర్పిస్తున్నారు. 

 

Loading...