highest-collections-of-NTR-cinema

సత్తా చాటిన 'అరవింద సమేత వీరరాఘవ'

ఎన్టీఆర్ సినిమా అంటే అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడంటే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించలేం. వీరిద్దరి కలయికలో రూపొందిన సినిమా 'అరవింద సమేత వీరరాఘవ'. హరిక-హసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్‌గా నటించింది. గురువారమే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఓవర్సిస్‌లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఓవర్సీస్‌లో మొత్తం 220 సెంటర్‌లలో సినిమా విడుదలైంది. మొదటిరోజే 7,97,366 డాలర్లు(రూ.5కోట్ల90లక్షల60వేల664) రాబట్టింది. ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో విడువలైన మొదటి రోజు ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సినిమాగా 'అరవింద సమేత' రికార్డు సృష్టించింది.