:: Welcome to NRI - Article ::

గల్ఫ్ జీవితాలపై తెలుగు సినిమా

సొంతఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు పీవీ సునీల్ కుమార్ రెడ్డి. చాలా గ్యాప్ తీసుకుని ఓ విభిన్న కథాంశంతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు వారి గల్ఫ్ బాధలను ఇతివృత్తంగా తీసుకుని సున్నితమైన భావోద్వేగాలతో చక్కని చిత్రానికి రూపకల్పన చేశారు పీవీ సునీల్ కుమార్ రెడ్డి. ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన గల్ఫ్ పోస్టర్.. అందరినీ ఆలోచింపజేస్తోంది.
 
గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలకోసం చాలామంది తెలుగువాళ్లు వలస వెళ్తున్నారనీ, అక్కడ ఎన్నో బాధలు పడుతున్నారని పీవీ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. అయా దేశాల అభివృద్ధిలో భాగస్వామ్యమైన మనోళ్లు.. చెప్పుకోలేని కష్టాలను అనుభవిస్తున్నారన్నారు.  మహిళలపై అరబ్బు షేకుల అత్యాచారాలు, మానవినకపోతే జైళ్లలో వేస్తున్నారని వాపోయారు. నిజజీవిత కథలనే ఈ సినిమాలో చూపించబోతున్నామన్నారు. ఏదిఏమైనా తెలుగు వారి గల్ఫ్ కష్టాల గురించి సినిమా తీస్తుండటంతో అక్కడి ప్రవాసులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.