geetha-govindham-sets-new-record

టాప్-10 లెక్కల్ని మార్చేసిన ‘గీత గోవిందం’

‘గీత గోవిందం’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. పాటలు అంచనాను పెంచేశాయి. ఊహించినట్టుగానే అందరి అంచనాలను నిజం చేస్తూ సినిమా సూపర్‌డూపర్ హిట్టుగా నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ విడుదల చేసిన ఈ సినిమా చక్కటి కథ, స్క్రీన్‌ప్లేతోపాటు నేపథ్య సంగీతం, నటీనటుల నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

కాగా.. ఫిదా, అజ్ఞాతవాసి, నాన్నకు ప్రేమతో, గౌతమిపుత్ర శాతకర్ణి, అత్తారింటికి దారేది, అర్జున్‌రెడ్డి, స్పైడర్, జై లవకుశ.. వంటి సినిమాల కలెక్షన్లను గీత గోవిందం దాటేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ కలెక్షన్లకు అతి చేరువలో ఉంది ఈ సినిమా. త్వరలో ఈ సినిమా రికార్డును కూడా గీత గోవిందం దాటేస్తుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు. 

అన్ని వర్గాలను ఆకట్టుకుని అంచనాలకు మించి అద్భుతమైన కలెక్షన్లను గీత గోవిందం రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ ‘గీత గోవిందం’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2.39 మిలియన్ డాలర్లను ఓవర్సీస్‌లో కలెక్ట్ చేసింది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల జాబితాలో తొమ్మిదవ స్థానానికి చేరింది. మొత్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో ఓవర్సీస్‌లో టాప్ 10 లెక్కల్ని ‘గీత గోవిందం’ మార్చేసింది. ఓవర్సీస్‌లో టాప్-10 సినిమాల జాబితా ఇది..

 
1.బాహుబలి-2-------------20.47 మిలియన్ డాలర్లు
2.బాహుబలి-1-------------7.51 మిలియన్ డాలర్లు
3.రంగస్థలం----------------3.42 మిలియన్ డాలర్లు
4.భరత్ అనే నేను--------- 3.17 మిలియన్ డాలర్లు 
5.శ్రీమంతుడు-------------2.89 మిలియన్ డాలర్లు
6. మహానటి--------------2.59 మిలియన్ డాలర్లు
7.అ ఆ --------------------2.45 మిలియన్ డాలర్లు
8. ఖైదీ నెం 150-----------2.45 మిలియన్ డాలర్లు
9.గీత గోవిందం------------2.39 మిలియన్ డాలర్లు(ఇంకా థియేటర్లలో సినిమా సందడి చేస్తోంది)
10.ఫిదా-------------------2.07 మిలియన్ డాలర్లు.