geetha-govindam-will-reach-the-target

`గీత‌గోవిందం` ఆ టార్గెట్ రీచ్ అవుతుందా?

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, బ్యూటిఫుల్ ర‌ష్మిక క‌లిసి న‌టించిన చిత్రం `గీత‌గోవిందం`. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఓవ‌ర్సీస్‌లోనూ స‌త్తా చాటుతూ రికార్డు క‌లెక్ష‌న్లు సాధిస్తోంది.
 
కేవ‌లం ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 42 కోట్ల రూపాయ‌ల షేర్ సాధించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. విజ‌య్ కెరీర్‌లో రూ.40 కోట్ల క్ల‌బ్‌లోకి చేరిన మొద‌టి సినిమా ఇదే. డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కెరీర్‌లోనూ ఇదే తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా. ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో రూ. 50 కోట్ల‌ను రీచ్ అవుతుంద‌ని విశ్లేష‌ణ‌లు విన‌బ‌డుతున్నాయి. పోటీ పెద్ద‌గా లేక‌పోవ‌డంతోపాటు, ఈ వారం కూడా ఆస‌క్తిక‌ర సినిమాలేవీ రిలీజ్ కాక‌పోతుండ‌డం `గీత‌గోవిందం`కు ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌ర్ కావ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.