Four-days-collections-of-Mister

మిస్టర్‌కు ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్లు ఇవీ

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ హీరోగా.. హెబ్బాపటేల్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించగా.. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ‘మిస్టర్’. భారీ తారాగణంతో తీసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా యావరేజ్‌ టాక్‌ను సంపాదించుకోలేకపోయింది. దూకుడు, బాద్‌షా వంటి సినిమాలతో పాటు ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకున్న ‘ఆగడు’కు కూడా ఓవర్సీస్‌లో భారీగానే కలెక్షన్లు వచ్చాయి. ఆయా సినిమాల హీరోలతోపాటు ఎన్నారైలకు శ్రీనువైట్ల సినిమాలపై ఉన్న ఆసక్తే ఈ కలెక్షన్లకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజాగా వచ్చిన మిస్టర్ సినిమా మాత్రం ఎన్నారైలను ఆకట్టుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో సినిమా కలెక్షన్లుకు ప్రాణంలాంటి వీకెండ్‌లో మిస్టర్ ఏ మాత్రం సత్తాచాటలేకపోయింది. కనీసం లక్ష డాలర్లను కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ప్రీమియర్ షోల ద్వారా గురువారం విడుదలైన ఈ సినిమా 35060 డాలర్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత శుక్రవారం 16వేల 483 డాలర్లు, శనివారం 12వేల 843 డాలర్లు, ఆదివారం 5వేల 986 డాలర్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద ఆదివారం వరకూ 70వేల 372 డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే 45 లక్షల 35వేల రూపాయలన్నమాట. ఈ కలెక్షన్ల వివరాలను బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.