:: Welcome to NRI - Article ::

మొదటి వీకెండ్‌లో స్పైడర్‌కు రికార్డు స్థాయిలో కలెక్షన్లు

మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటించిన స్పైడర్‌కు మొదటి వారంలో రికార్డు కలెక్షన్లు వచ్చాయి. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య, ప్రేమిస్తే భరత్, విలన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబ్ర 27న విడుదలయింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా.. ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లను కొల్లగొడుతోంది. బాహుబలి తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక స్క్రీన్లలో విడుదలయిన ఈ సినిమా.. ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్ మార్కును దాటేసింది. శనివారం వరకు ఓవర్సీస్‌లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అమెరికాలో మంగళవారం విడుదలయిన ఈ సినిమాకు శనివారం వరకు వచ్చిన కలెక్షన్ల వివరాలివి..

 
మంగళవారం(ప్రీమియర్స్)+గురువారం ===== 11 లక్షల 83వేల 611 డాలర్లు
శుక్రవారం ===== 94వేల 394 డాలర్లు
శనివారం  ===== లక్షా 21వేల 91 డాలర్లు
మొత్తం ===== 13 లక్షల 99వేల 96 డాలర్లు (9.14 కోట్ల రూపాయలు)
 
కాగా ఈ సినిమాకు మొదటి వీకెండ్‌లో 110 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. అయిదు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటేసిందని వెల్లడించారు. ఈ కలెక్షన్లలో అత్యధిక శాతం ఓవర్సీస్ నుంచే వస్తున్నాయన్నారు.