First-weekend-collections-of-Geetha-Govindam

రెండు మిలియన్ డాలర్ల దిశగా గీత గోవిందం

విజయ్ దేవరకొండ మరోసారి మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు అమెరికాలో మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించాయి. తాజాగా గీత గోవిందంతో మరో సారి ఈ క్లబ్‌లోకి చేరాడు. ఎన్నారైలను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తోంది. అమెరికాలో విడుదలయిన మొదటి మూడు రోజుల్లో 7 లక్షల 31 వేల డాలర్లను రాబట్టింది. వీకెండ్‌లో శుక్రవారం 2 లక్షల 40 వేల 941 డాలర్లు, శనివారం 3 లక్షల 54 వేల 433 డాలర్లు, ఆదివారం 2 లక్షల 12 వేల 610 డాలర్ల కలెక్షన్లను సాధించింది. మొత్తంగా గీత గోవిందం 15 లక్షల 39 వేల 474 డాలర్ల(రూ.10 కోట్ల 75 లక్షలు)ను రాబట్టి 2 మిలియన్ క్లబ్‌కు చేరువలో ఉందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 55 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.