first-film-in-saudi

సౌదీలో విడుదలవుతున్న మొదటి సినిమా..

సౌదీలో సినిమాలపై నిషేధం ఎత్తివేసి కొన్ని నెలలు గడిచింది. అయితే హలీవుడ్ సినిమాలు మాత్రమే సౌదీలో విడుదలవుతున్నాయి. కానీ, ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సినిమా ఆ దేశంలో విడుదల కాలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటిసారిగా అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సౌదీలో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో అక్షయ్‌కుమారే ప్రకటించారు.

అక్షయ్  గురువారం సాయంత్రం తన ట్వీట్టర్ ఖాతాలో సినిమా విడుదల గురించి ట్వీట్ చేశారు. సౌదీలో విడుదలవుతున్న మొదటి బాలీవుడ్ సినిమా తనదే కావడం తనకెంతో సంతోషంగా ఉందని అక్షయ్ తెలిపాడు. హాకీ క్రీడాకారుడు 'తపన్ దాస్' జీవిత కథ ఆధారంగా సినిమా తీశారు. ఈ సినిమాకు రీమా కాగ్తీ దర్శకత్వం వహించారు.