:: Welcome to NRI - Article ::

కలెక్షన్లు కుమ్మేస్తున్న 'ఫిదా'

రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ఫిదా'. ఓవర్సీస్ ఆడియెన్స్‌ను ఫుల్‌గా ఫిదా చేసేస్తోంది. యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఓవర్సీస్ మార్కెట్‌లో 'ఫిదా' చిత్రం దుమ్మురేపుతోంది. శేఖర్ కమ్ముల బ్రాండ్‌తో ఈ సినిమా యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

మూడు వారాలు గడిచేసరికి ఈ చిత్రానికి ఓవర్సీస్ లో 1.91 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఇప్పటివరకూ యు.ఎస్. టాప్ టెన్ టాలీవుడ్ వసూళ్లలో.. 1.8 మిలియన్ డాలర్లతో 7వ స్థానంలో ఉన్న పవన్ 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని బీట్ చేసి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది 'ఫిదా'. ఇక మెగా ఫ్యామిలీ హీరోల్లో ఓవర్సీస్ వసూళ్లలో వరుణ్ తేజ్ 'ఫిదా' కంటే ముందున్న చిత్రం చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' మాత్రమే.

 యు.ఎస్. బాక్సాఫీస్ వసూళ్లలో టాలీవుడ్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన చిత్రం 'బాహుబలి-2'. ఈ మేగ్నమ్ ఓపస్.. 20 మిలియన్ డాలర్ల వసూళ్లతో మొదటి స్థానంలో నిలవగా యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద రెండో స్థానంలో 6.9 మిలియన్ డాలర్ల వసూళ్లతో 'బాహుబలి-1' ఉంది. ఇక 2.8 మిలియన్ డాలర్ల వసూళ్లతో మూడో స్థానంలో 'శ్రీమంతుడు', 2.449 మిలియన్ డాలర్ల వసూళ్లతో నాలుగో స్థానంలో 'అ..ఆ', 2.445 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఐదో స్థానంలో 'ఖైదీ నంబర్ 150' చిత్రాలు నిలిచాయి. మొత్తంమీద యు.ఎస్. బాక్సాఫీస్ టాలీవుడ్ టాప్ టెన్ లో చిన్న చిత్రాలుగా విడుదలైన 'అ..ఆ', 'ఫిదా' ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.

 

Loading...