Everything-set-for-Yatra-premiere-shows

అమెరికాలో ‘యాత్ర’కు అంతా సిద్ధం..

వాషింగ్టన్: తెలుగు చిత్రసీమ ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని ఎదురు చూస్తున్న జీవితచరిత్రల్లో ఒకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లంతా కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 70ఎంఎం ఎంటరటైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రీమియర్ షోలకు అమెరికా ముస్తాబయింది. అమెరికా వ్యాప్తంగా 140పైగా థియేటర్లలో విడుదలవుతున్న యాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించారు. అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు నిర్వహించే సినిమా హాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. అవి. 1.మిల్పిటాస్, సీఏ  2.ఆరెంజ్, 3.డల్లాస్,  4.అట్లాంటా, 5.చికాగో, 6.షార్లెట్, 7. మోరిస్‌విల్లె, 8. హ‌ోస్టన్, 9.సెంటర్ విల్లె, 10. నార్త్ బ్యూన్స్, 11. క్రిస్టియానా, 12. నోవి, 13. బెల్లెవూ, 14. ఫెయిర్‌ఫాక్స్.