Collections-of-three-movies-on-Monday

పండుగరోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయిన తెలుగు సినిమాలు.. ప్రేక్షకులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అజ్ఞాతవాసి పూర్తిగా నెగిటివ్ టాక్ తెచ్చుకోగా.. జై సింహా సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయింది. రంగుల రాట్నం కూడా సరిగా ఆకట్టుకోలకపోయింది. అయినా సంక్రాంతి పండుగను సినిమాలతో చేసుకునే తెలుగు వాళ్లు... థియేటర్లకు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ప్రవాసులు సినిమాలతో పండుగ చేసుకున్నారు. 

 
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా విడుదలయిన ఈ మూడు సినిమాలకు సంక్రాంతి పండుగ రోజయిన సోమవారం నాడు ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. మూడు సినిమాల్లో అజ్ఞాతవాసి సినిమా అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టింది. 257 లొకేషన్లలో విడుదలయిన ఈ సినిమా సోమవారం నాడు 32వేల 146 డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తం మీద ఈ సినిమా 20 లక్షల 17వేల 15 డాలర్లను కొల్లగొట్టింది. 
 
క్లాస్ అండ్ ఫ్యామిలీ సినిమాలను ఎక్కువగా ఆదరించే ప్రవాసులు.. మాస్ ఎంటర్‌టైనర్ అయిన జై సింహాకు కూడా ఓ మోస్తరు కలెక్షన్లను అందించారు. 61 లొకేషన్లలో విడుదలయిన ఈ సినిమా సోమవారం నాడు 10వేల 979 డాలర్లు వచ్చాయి. మొత్తం మీద ఈ సినిమా 2 లక్షల 2వేల 621 డాలర్లను కలెక్ట్ చేసింది. 30 లొకేషన్లలో విడుదలయిన రంగుల రాట్నం సినిమాకు సోమవారం 6వేల 711 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో మొత్తం మీద ఈ సినిమాకు 47వేల 991 డాలర్ల కలెక్షన్లు వచ్చినట్టయింది.