:: Welcome to NRI - Article ::

పీకే రికార్డును దాటేసిన ఖైదీ నెంబర్ 150

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఖైదీ నెంబర్ 150.. సినిమా విడుదలయ్యే థియేటర్లన్నీ జాతరలా మారిపోయాయి. విడుదలయిన మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది చిరు సినిమా. అమెరికాలో అయితే అభిమానులు సంబరాలు మిన్నంటాయి. ప్రీమియర్ షోల ద్వారా లక్ష మిలియన్ డాలర్లకు పైగానే కొల్లగొట్టి తెలుగులో బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన చిరు.. తాజాగా బాలీవుడ్‌పై గురిపెట్టాడు. అమీర్‌ఖాన్ నటించిన పీకే సినిమా.. ఓవర్సీస్ ప్రీమియర్ షో కలెక్షన్లలో అరుదైన రికార్డును సాధించింది. బాహుబలితోపాటు పీకే కూడా లక్ష డాలర్లకు పైగా ప్రీమియర్ షోల ద్వారా కలెక్షన్లు సాధించింది. తాజాగా చిరు ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా బాహుబలితోపాటు పీకే సినిమా రికార్డును కూడా దాటేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓ తెలుగు సినిమా బాలీవుడ్ సినిమా రికార్డులను దాటడం బాహుబలి తర్వాత ఇదే మొదటిసారి అని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి చిరు సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచిచూడాలి.