charan-breaked-chiru-record-

మెగాస్టార్ రికార్డు బ్రేక్ చేసిన చరణ్..

రంగస్థలం సినిమా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించడంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. పాటలు కూడా వినసొంపుగా ఉండటం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. రామ్ చరణ్ నటించిన సినిమాలన్నింటిలోకి రంగస్థలం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా సినిమా బాక్స్‌ఫీస్ వద్ద దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ రంగస్థలం రికార్డులు సృష్టిస్తోంది.

ఓవర్సీస్ కలెక్షన్ల పరంగా ఇప్పటికే పవన్ సినిమా అజ్ఞాతవాసి కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్150ని కూడా బీట్ చేసి, ఓవరల్‌ కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లో టాప్‌-10 తెలుగు చిత్రాల్లో రంగస్థలం నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. రంగస్థలానికి పోటీనిచ్చే సినిమా లేకపోవడంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే బాహుబలి తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన శ్రీమంతుడిని కూడా బీట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.