:: Welcome to NRI - Article ::

గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్య ఎంట్రీ సీన్ ఇదే

గౌతమిపుత్ర శాతకర్ణి.. బాలయ్యకు వందో సినిమా. దర్శకుడిగా క్రిష్‌కు ఆరో సినిమా. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెలుగు చక్రవర్తి కథను తెరకెక్కించారు. విడుదలకు అన్ని విధాల సిద్ధమై.. గురువారం థియేటర్లలోకి రానుంది. బాలయ్య కెరీర్లో ఎప్పుడూ  లేనంతగా ఈ సినిమాకు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 45 దేశాల్లో విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. విడుదలకు కొద్దిసమయమే ఉండటంతో సినిమా ప్రమోషన్‌ను విపరీతంగా చేస్తోంది చిత్రబృదం. బాలయ్యతోపాటు క్రిష్, శ్రియ.. ఈ ప్రమోషన్లలో పాలుపంచుకుంటున్నారు. దీనిలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను క్రిష్ బయటపెట్టారు. ఏ సినిమా అయినా సరే.. ఏ సీన్‌తో మొదలవుతుంది.. హీరో ఎలా ఎంట్రీ ఇస్తారనే విషయంపైనే ఎక్కువగా మాట్లాడుకుంటారు. క్రిష్ కూడా దీనికి సంబంధించిన విషయాన్నే బయటపెట్టి బాలయ్య ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యేలా చేశారు.
 
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభమే.. బాలయ్య వాయిస్‌ ఓవర్‌తో స్టార్ట్ అవుతుందట. ‘మీ రాజ్యాన్ని మాకప్పగించి.. మాకు సామంతులవుతారని ఆశిస్తున్నా.. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా..’ అంటూ ఓ రాజుకు శాతకర్ణి పంపే హెచ్చరికతో సినిమా ప్రారంభమవుతుందనీ, బాలయ్య ఎంట్రీ కూడా అదుర్స్ అనిపించేలా ఉంటుందని తెలిపారు. క్రిష్ చెప్పిన ఈ విషయంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. బాలయ్య ఎంట్రీనే వీరోచిత పోరాటంతో ఉంటే.. అంతకంటే ఇంకేం కావాలంటూ పొంగిపోతున్నారు.