:: Welcome to NRI - Article ::

దుబాయికి వెళ్లనున్న బాహుబలి-2 టీమ్

బాహుబలి.. బాహుబలి.. ఈ ఒక్క పదం ప్రపంచమంతా మారుమోగిపోతోంది. ఏప్రిల్ 28వ తారీఖున విడుదలయే ఈ సినిమా రెండో పార్ట్ కోసం భాషా భేదం లేకుండా సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్, అమెరికా, కెనడా, చైనా, జర్మనీ.. వంటి దేశాల్లోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో కూడా ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 25న బాహుబలి-2 టీమ్ దుబాయికి వెళ్లనుంది. దుబాయిలోని రాక్సీ సినిమాస్‌లో గురువారం జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో హీరో ప్రభాస్, ప్రతినాయకుడు రానా దగ్గుబాటి, అనుష్కతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొననున్నారు. అభిమానులతో కలిసి బాహుబలి-2 చిత్రీకరణ ముచ్చట్లు చెప్పుకోనున్నారు. 

 

Loading...