:: Welcome to NRI - Article ::

బాహుబలి-2 ఓవర్సీస్ బిబినెస్ ఎంతో తెలుసా

విడుదలకు ముందే బాహుబలి-2 ఎన్నెన్నో అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్నదానికి సమాధానం దొరకాలంటే.. రెండో పార్ట్ విడుదలవ్వాల్సిందే. ఆ ప్రశ్న ఎంత సంచలనంగా మారిందో.. ఇప్పుడు బాహుబలి మార్కెట్ (బిజినెస్) కూడా సంచలనంగా మారుతోంది. బాహుబలి-2 ప్రి రిలీజ్ బిజినెస్ బాహుబలి కన్నా 40 శాతం ఎక్కువగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

మరొపక్క ఈ సినిమా హక్కుల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించిన విషయం ఒకటి బయటికి వచ్చింది.అదేమిటంటే ఉత్తర అమెరికా (ఓవర్సీస్)లో ఈ సినిమా హక్కులను రూ.45 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అదే నిజమైతే అక్కడ ఓ కొత్త రికార్డు నమోదైనట్టే. ఇక, ఇటు నైజాంలోనూ భారీ బిజినెస్ చేస్తోందట బాహుబలి-ది కన్‌క్లూజన్. మరి బాహుబలి-2 ఇంకెన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నిరీక్షణ తప్పదు.