:: Welcome to NRI - Article ::

అరుదైన రికార్డుకి చేరువలో బాహుబలి-2

బాహుబలి-2 సినిమాకు ప్రపంచ దేశాలు బ్రహ్మరథం పడుతున్నాయి. దీంతో బాహుబలి సరికొత్త మైల్‌స్టోన్‌కు చేరుకోనుంది. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి భారత చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు సృష్టించగా.. ఇప్పుడు మరో రికార్డును నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు దాదాపు రూ.1450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఒకటీరెండు రోజుల్లో రూ. 1500 కోట్ల మార్క్‌ను దాటనుంది. నెల వ్యవధిలోనే ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి-2 రికార్డ్ సృష్టించనుంది. సినిమా విడుదలైన తొలివారంలోనే దేశ వ్యాప్తంగా రూ. 1012 కోట్లు సాధించగా.. ఓవర్సీస్‌తో కలిపి రూ.1250 కోట్లు సాధించింది. కాగా, తాజా లెక్కల ప్రకారం 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.1450 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి-2 నిలిచింది.