:: Welcome to NRI - Article ::

50రోజులు పూర్తి చేసుకున్న‌ బాహుబ‌లి-2

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఓ సినిమా రెండు మూడు వారాల పాటు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తేనే గొప్ప. వారం రోజుల్లోనే సినిమాకు పెట్టిన ఖ‌ర్చును రాబ‌ట్టాల‌నేది నిర్మాత‌ల ప్లాన్. కొత్త‌గా వ‌చ్చే సినిమాలు, దీనికి తోడు క్రికెట్ సీజ‌న్.. వంటి అడ్డంకులు ఎన్ని ఎదురైనా బాహుబ‌లి-2 మాత్రం రికార్డు థియేట‌ర్ల‌లో 50 రోజుల‌ను పూర్తి చేసుకుని కొత్త చ‌రిత్ర లిఖించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రెండు వేల‌కు పైగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా 1050 థియేట‌ర్ల‌లో 50 రోజుల‌ను పూర్తి చేసుకున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ ప్ర‌క‌ట‌పై  బాలీవుడ్ సినీ విశ్లేష‌కుడు త‌రణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. క్రికెట్ సీజ‌న్ వ‌చ్చినా, కొత్త సినిమాలు వారం వారం విడుద‌లువుతున్నా బాహుబ‌లి-2 ప్ర‌భంజ‌నాన్ని ఆప‌లేక‌పోయాయ‌నే అర్థం వ‌చ్చేలా ట్వీట్ చేశారు. ఓవ‌ర్సీస్‌లో బాహుబ‌లి-2 ఇప్ప‌టికే 20 మిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటేసి న‌యా చ‌రిత్ర‌ను లిఖించింది.