:: Welcome to NRI - Article ::

టాప్ హీరోల రికార్డుల్ని బ్రేక్ చేసి టాప్-10లోకి ‘అర్జున్ రెడ్డి’

అర్జున్ రెడ్డి సినిమాకు విడుదలకు ముందు వివాదాలు.. విడుదల తర్వాత వివాదాలతోపాటు ప్రశంసల వర్షం. సినిమాను బ్యాన్ చేయాలని కొందరు ర్యాలీలు తీస్తే.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందంటూ తెలుగు సెలబ్రెటీలు పొగిడారు. మహేశ్‌బాబు నుంచి రాజమౌళి వరకు అందరూ సినిమాను ప్రశంసించిన వాళ్లే.. అందుకే ఈ సినిమాకు కలెక్షన్లు కూడా విపరీతంగా వచ్చేశాయి. సినిమా పెట్టుబడికి కొన్ని రెట్ల లాభం వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా, షాలిని పాడే హీరోయిన్‌గా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను చూసేందుకు కుర్రకారు మళ్లీమళ్లీ థియేటర్ల ముందు క్యూ కడుతోంది. 
 
నిర్వాణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్‌లో అమెరికాలో ఈ సినిమా విడుదలయింది. విడుదలయిన వారంలోనే ఏకంగా ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ తర్వాత కూడా పెద్ద హిట్ సినిమాలు ఏవీ రాకపోవడంతో కలెక్షన్లను అర్జున్ రెడ్డి పోగేసుకుంది. ఒక్కో హీరో రికార్డును దాటేస్తూ.. ఏకంగా ఓవర్సీస్‌లో తెలుగులో టాప్-10 సినిమాల్లో ఒకటిగా నిలిచిందని డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. మొత్తం 16 లక్షల 66వేల డాలర్లను కొల్లగొట్టి అప్పటివరకూ టాప్-10 ప్లేస్‌లో ఉన్న బాలయ్య సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డును బ్రేక్  చేసి.. ఆ స్థానాన్ని అర్జున్ రెడ్డి భర్తీ చేసింది. అర్జున్ రెడ్డి సూపర్ హిట్‌తో గౌతమిపుత్ర శాతకర్ణి ఓవర్సీస్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 12వ స్థానంలో మహేశ్ - వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, 13వ స్థానంలో ఊపిరి, 14వ స్థానంలో దూకుడు, 15వ స్థానంలో మనం, 16వ స్థానంలో ఆగడు, 17వ స్థానంలో ధృవ 18వ స్థానంలో భలేభలే మగాడివోయ్, 19వ స్థానంలో రేసుగుర్రం, 20వ స్థానంలో 1 నేనొక్కడినే సినిమాలు నిలిచాయి. ఓవర్సీస్‌లో 9వ స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా జనతాగ్యారేజ్‌కు 1.80 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే 1.66 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి టాప్ 10 ప్లేస్‌లో ఉన్న అర్జున్ రెడ్డి.. లాంగ్‌రన్‌లో ఎన్టీఆర్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 
 
ఓవర్సీస్‌లో టాప్-10 సినిమాల లిస్ట్ ఇదీ.. 
 
1. బాహుబలి-2 ===== 20.47 మిలియన్ డాలర్లు
2. బాహుబలి-1=====7.51 మిలియన్ డాలర్లు
3. శ్రీమంతుడు===== 2.89 మిలియన్ డాలర్లు
4. అ.ఆ..===== 2.45 మిలియన్ డాలర్లు
5. ఖైదీ నెం.150===== 2.45 మిలియన్ డాలర్లు
6. ఫిదా===== 2.07 మిలియన్ డాలర్లు
7. నాన్నకు ప్రేమతో..===== 2.02 మిలియన్ డాలర్లు
8. అత్తారింటికి దారేది===== 1.90 మిలియన్ డాలర్లు
9. జనతాగ్యారేజ్===== 1.80 మిలియన్ డాలర్లు
10. అర్జున్‌రెడ్డి===== 1.66 మిలియన్ డాలర్లు