:: Welcome to NRI - Article ::

అల్లు అర్జున్, నాని, ఫిదా రికార్డులు బ్రేక్ చేసిన అర్జున్ రెడ్డి

అర్జున్‌రెడ్డి.. తెలుగు సినీ చరిత్రలో మరో వందేళ్ల పాటు ఈ సినిమా గుర్తుండిపోతుందంటూ క్రిష్ వంటి స్టార్ డైరెక్టర్లు ఎందరో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సినీ ప్రముఖుల ప్రశంసలకు తగ్గట్టుగానే అర్జున్‌రెడ్డి సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, షాలిని పాడే హీరోయిన్‌గా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ బోల్డ్ డైలాగ్స్‌తో యువతకు తెగ నచ్చేసింది. ఈ నవతరం దేవదాసు కథకు యువత బాగా కనెక్ట్ అయింది. తెలుగు రాష్టాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పెద్ద పెద్ద హీరోల రికార్డులను కూడా బ్రేక్ చేసేంతగా అర్జున్‌రెడ్డి సినిమా కలెక్షన్లను సాధిస్తోంది. 

 
ఓవర్సీస్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా గురువారం ప్రీమియర్ల ద్వారా అర్జున్‌రెడ్డి విడుదల అయింది. ప్రీమియర్లు, మొదటి రోజు కలెక్షన్లతో మెగా హీరోల రికార్డుల్ని బ్రేక్ చేసింది. హిట్ సినిమాల కలెక్షన్లను కూడా దాటేసింది. అర్జున్‌రెడ్డి సినిమాకు ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోతోపాటు మొదటి రోజు కలెక్షన్లు రెండింటినీ కలిపి 4 లక్షల 60వేల డాలర్లు వచ్చాయి. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాకు ప్రీమియర్ ప్లస్ మొదటిరోజు కలిపి 3 లక్షల 96వేల డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. నాని హీరోగా వచ్చిన నేను లోకల్‌ సినిమాకు 3 లక్షల 61వేల డాలర్లు రాగా, తాజా హిట్ మూవీ ‘నిన్ను కోరి’కి 3 లక్షల 82వేల డాలర్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌ను కూడా కలెక్షన్ల వర్షంతో ముంచెత్తిన ఫిదా సినిమాకు ప్రీమియర్ ప్లస్ మొదటి రోజు కలిపి 3 లక్షల 78వేల డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమాకు 74వేల డాలర్లు మాత్రమే రావడం గమనార్హం. 
 
రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధృవ సినిమాకు.. అర్జున్‌‌రెడ్డి సినిమా కంటే కేవలం 9వేల డాలర్ల కలెక్షన్లు మాత్రమే ఎక్కువ రావడం గమనార్హం. ధృవ సినిమాకు ప్రీమియర్ ప్లస్ మొదటిరోజు కలెక్షన్లు కలిపి 4 లక్షల 69వేల డాలర్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో టాప్-4 ప్లేస్‌లో ఉన్న అ.ఆ.. సినిమాకు 4 లక్షల 95వేల డాలర్లు వచ్చాయి. ఈ వివరాలన్నింటినీ.. ఓవర్సీస్‌లో అర్జున్‌రెడ్డి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్వాణ సినిమాస్ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్‌లో దాదాపు 85 స్క్రీన్లలో అర్జున్‌రెడ్డి సినిమా సందడి చేస్తోంది.