aravinda-sametha-collections-

'అరవింద సమేత వీరరాఘవ' ప్రీమియర్ కలెక్షన్స్

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. హరిక-హసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. విడువలైన మొదటిరోజు నుంచే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల  పరంగా 'అరవింద సమేత వీరరాఘవ' దూసుకుపోతోంది.

ఇదిలావుండగా సినిమా విడుదలకు ఒకరోజు ముందే అంటే బుధవారం అమెరికాలో 218 సెంటర్‌లలో 'అరవింద సమేత వీరరాఘవ' ప్రిమియర్ షోలను ప్రదర్శించారు. కేవలం ప్రీమియర్‌షోల ద్వారానే ఈ సినిమా 7,91,021 డాలర్లు(రూ.5.85కోట్లు) రాబట్టి శుభారంభం చేసిందని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కలెక్షన్లు ఇలాగే కొనసాగితే 'అరవింద సమేత వీరరాఘవ' ముందు ముందు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందేనని తరుణ్ అభిప్రాయపడుతున్నాడు.