another-record-added-for-KGF-movie

కేజీయఫ్ మరో సంచలనం.!

విడుదలైన అన్ని భాషల్లోనూ కనకవర్షం కురిపిస్తున్న ‘కేజీయఫ్’ మరో సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌లో విడుదలైన తొలి కన్నడ సినిమాగా రికార్డులకెక్కింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను లాహోర్, ఇస్లామాబాద్‌లలోని మల్టిప్లెక్స్‌లలో శుక్రవారం విడుదల చేశారు. అక్కడ కూడా ప్రజాదరణ పొందడం విశేషం. కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరో కాగా.. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశాడు. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందింది. తొలి భాగం గత డిసెంబర్‌లో రిలీజ్ చేయగా.. రెండో భాగాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో యశ్ ఒక్క దక్షిణాదిలోనే కాక.. ఉత్తరాదిలోనూ సూపర్ క్రేజ్ సంపాదించాడు.

 
కన్నడ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమా ‘కేజీయఫ్’. దేశవ్యాప్తంగా 2400 థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వగా.. 200 కోట్ల రూపాయల పైబడి వసూళ్లు రాబట్టింది. ఓవర్సిస్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. హిందీ డబ్బింగ్ సినిమాల్లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా ‘కేజీయఫ్’ నిలిచింది.