agythavaasi-overall-collection-in-telugu-states

తెలుగు రాష్ట్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఓవరాల్ కలెక్షన్లు ఇవే..

త్రివిక్రమ్ శ్రీనివాస్- పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి.. బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. మిశ్రమ స్పందన వచ్చినా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అమెరికాలో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను పేర్కొంటూ తరణ్ ఆదర్శ్ కొన్ని కామెంట్స్ చేశారు. అమెరికాలో ఈ సినిమా ఏకంగా 15 లక్షల 13వేల 540 డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే అక్షరాలా 9 కోట్ల 65 లక్షల రూపాయలన్నమాట.

 
ఏపీ, తెలంగాణలో కలెక్షన్ల సునామీ..
బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘అజ్ఞాతవాసి’ మొదటి రోజు కలెక్షన్లపరంగా ఏపీ, తెలంగాణలో దుమ్మురేపింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టి పలు సినిమాలను వెనక్కునెట్టేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజైన బుధవారం అక్షరాల రూ.33 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. పవన్ సినిమాలైన కాటమరాయుడు రూ.28.10 కోట్లు, సర్ధార్ గబ్బర్ సింగ్ రూ.26.90 కోట్లను అధిగమించింది.  మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా కలెక్ట్ చేసిన రూ.30 కోట్ల రికార్డును అధిగమించి  బాహుబలి-2 తర్వాత స్థానాన్ని దక్కించింది. బహుబలి-2కి మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.57.40 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మాత్రమే 33 కోట్ల గ్రాస్ సాధించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక అమెరికాలో 9.65 కోట్లను కొల్లగొట్టిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజున 55 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా పవన్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ స్థాయి కలెక్షన్లు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు. పవన్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను సాధించిన సినిమాగా అజ్ఞాతవాసి సినిమా రికార్డు సృష్టించిందని వెల్లడించారు.