agynathavaasi-movies-crosses-overseas-collections-of-jailavakusa

జై లవకుశ ఓవర్సిస్ రికార్డు బ్రేక్..?

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలయిన అజ్ఞాతవాసి సినిమా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.  కలెక్షన్ల పరంగా కీలకంగా మారిన అమెరికాలో ‘ఎల్‌ఏ తెలుగు’ సంస్థ అజ్ఞాతవాసిని డిస్ట్రిబ్యూషన్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల కంటే ఓ రోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా అమెరికాలో సందడి చేసింది. మంగళవారం ప్రీమియర్స్, మొదటిరోజైన బుధవారం కలెక్షన్ల ద్వారా  అమెరికాలో మొత్తం 1.7 మిలియన్ డాలర్లను అజ్ఞాతవాసి కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ చేశారు..

అయితే ‘అజ్ఞాతవాసి’ వసూలు చేసిన కలెక్షన్లు ఆసక్తికలిగిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో మెప్పించిన సూపర్ హిట్ సినిమా ‘జై లవకుశ’ అమెరికాలో ఓవరాల్‌గా కలెక్ట్ చేసిన వసూళ్లను ‘అజ్ఞాతవాసి’ అధిగమించింది. యూఎస్‌ఏలో ‘జై లవకుశ’కు మొత్తం 1.56 మిలియన్ డాలర్లు వసూలవ్వగా.. ప్రీమియర్ షోలు, మొదటి రోజు వసూళ్లతో అజ్ఞాతవాసికి 1.68 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. దీంతో ‘జై లవకుశ’ ఓవరాల్‌గా యూఎస్‌ఏ కలెక్ట్ చేసిన వసూళ్లను అజ్ఞాతవాసి అధిగమించింది. అమెరికాలో 20 రోజుల ముందుగానే బుకింగ్స్ ప్రారంభమవ్వడం, ఆఫర్లు ఉండే మంగళవారం విడుదలవ్వడం, పోటీలేకపోవడం సినిమా కలెక్షన్లకు కారణమని విశ్లేషకులు చెపుతున్నారు.