Agnyaathavaasi-crosses-Janatha-Garrage-record

జనతాగ్యారేజ్‌ను దాటేసిన అజ్ఞాతవాసి

టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద అజ్ఞాతవాసి సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. మొదటి రోజే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా, అనుకున్నంత రేంజ్‌లో లేదని సినీ ప్రేక్షకులు పెదవి విరిచినా రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్- పవన్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలయిన సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా ఏకంగా 600 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలయింది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 
 
శుక్రవారం వరకు అజ్ఞాతవాసి సినిమాకు 18 లక్షల 8వేల 924 డాలర్ల కలెక్షన్లు వచ్చాయని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంటే ఏకంగా 11.50 కోట్ల రూపాయలన్నమాట. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్న అజ్ఞాతవాసి.. అమెరికాలో ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ కలెక్షన్లను దాటేసింది. జనతాగ్యారేజ్‌కు ఓవర్సీస్‌లో 1.80 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల లిస్ట్‌లో 9వ స్థానంలో జనతాగ్యారేజ్ ఉంది. ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యస్ట్ ఓవర్సీస్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో.. ఇది రెండోది. ఇప్పుడు అజ్ఞాతవాసి.. జనతాగ్యారేజ్‌ను పదోస్థానానికి నెట్టేసి.. తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఈ వీకెండ్‌ను ఫుల్‌గా క్యాష్ చేసుకుంటే మరిన్ని రికార్డులను అజ్ఞాతవాసి నమోదు చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.