Agnyaathavaasi-Cross-Balayya-GPSK-overall-collections

బాలకృష్ణ రికార్డును బ్రేక్ చేసిన పవన్

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలయిన అజ్ఞాతవాసి సినిమా.. ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంటోంది.  అమెరికాలో ‘ఎల్‌ఏ తెలుగు’ సంస్థ అజ్ఞాతవాసిని డిస్ట్రిబ్యూషన్‌ చేసింది. అమెరికా వ్యాప్తంగా 600 స్రీన్లలో ఈ సినిమా విడుదలయింది. తెలుగు రాష్ట్రాల కంటే ఓ రోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. ప్రీమియర్ బుకింగ్స్‌ను దాదాపు 20 రోజుల ముందుగానే ఆన్‌లైన్‌లో పెట్టడం.. ఆఫర్లు ఎక్కువగా ఉండే మంగళవారం నాడు ప్రీమియర్లు ఉండటంతో రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయి. అమెరికాలో మంగళవారం ప్రీమియర్లకు 1.5 మిలియన్ డాలర్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత బుధవారం వచ్చిన కలెక్షన్లతో కలిపి.. 1.7 మిలియన్ డాలర్లను అజ్ఞాతవాసి కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ చేశారు..
 
గతేడాది అన్నయ్య చిరంజీవితో పోటీపడిన బాలయ్య... ఈ యేడాది సంక్రాంతి రేసులో తమ్ముడు పవన్‌తో పోటీపడుతున్నారు. శుక్రవారం జై సింహాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి... బాలయ్య కెరీర్లో మునుపెన్నడూ లేని విధంగా ఓవర్సీస్‌లో 1.66 మిలియన్ డాలర్ల కలెక్షన్లు కలెక్ట్ చేసింది. బాలకృష్ణ సినిమాల్లో వన్ మిలియన్ డాలర్లను దాటిన ఏకైక సినిమా ఇదే కావడం గమనార్హం. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఓవరాల్ కలెక్షన్లను పనవ్ అజ్ఞాతవాసి ప్రీమియర్లు ప్లస్ మొదటి రోజు కలెక్షన్లతోనే దాటేయడం గమనార్హం. అజ్ఞాతవాసికి మిక్స్‌డ్ టాక్ రావడంతో.. జై సింహా ఫలితం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.