Agnathavaasi-movie-collections-crosses-over-collection-of-spyder

స్పైడర్ ఓవరాల్ కలెక్షన్లు దాటేసిన అజ్ఞాతవాసి

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలయిన అజ్ఞాతవాసి సినిమా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.  కలెక్షన్ల పరంగా కీలకంగా మారిన అమెరికాలో ‘ఎల్‌ఏ తెలుగు’ సంస్థ అజ్ఞాతవాసిని డిస్ట్రిబ్యూషన్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల కంటే ఓ రోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా అమెరికాలో సందడి చేసింది. మంగళవారం ప్రీమియర్స్, మొదటిరోజైన బుధవారం కలెక్షన్ల ద్వారా  అమెరికాలో మొత్తం 1.7 మిలియన్ డాలర్లను అజ్ఞాతవాసి కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ చేశారు..

అయితే ‘అజ్ఞాతవాసి’ వసూలు చేసిన కలెక్షన్లు ఆసక్తికలిగిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమా అమెరికాలో ఓవరాల్‌గా కలెక్ట్ చేసిన వసూళ్లను ‘అజ్ఞాతవాసి’ అధిగమించింది. యూఎస్‌ఏలో ‘స్పైడర్’కు మొత్తం 1.56 మిలియన్ డాలర్లు వసూలవ్వగా.. ప్రీమియర్ షోలు, మొదటి రోజు వసూళ్లతో అజ్ఞాతవాసికి 1.68 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. దీంతో స్పైడర్ ఓవరాల్‌గా కలెక్ట్ చేసిన వసూళ్లను అజ్ఞాతవాసి సులభంగా అధిగమించింది. అమెరికాలో 20 రోజుల ముందుగానే బుకింగ్స్ ప్రారంభమవ్వడం, ఆఫర్లు ఉండే మంగళవారం విడుదలవ్వడం, పోటీలేకపోవడం సినిమా కలెక్షన్లకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.