2017-top-5-movies-collected-primier-shows

2017లో ఓవర్సిస్ ప్రీమియర్ షోల ద్వారా అదరగొట్టిన సినిమాలు

ట్రెండ్ మారింది.. ఓ సినిమా హిట్ అని చెప్పడానికి కలెక్షన్లనే ప్రామాణికంగా వ్యవహరిస్తున్నారు. ఒక హిరో ఇమేజ్, సినిమా ఫలితం మొత్తం కలెక్షన్ల మీదే ఆధారపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా తెలుగు సినిమాలు కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు కలెక్షన్లతో ఆగిపోయిన సినిమాలు.. ఓవర్సీస్‌లో మాత్రం టాప్‌లోకి దూసుకెళ్లిన సంఘటనలు చాలానే ఉన్నాయి. 2017లో కూడా చాలా సినిమాలు ఓవర్సీస్‌లో విడుదలయ్యాయి. ప్రీమియర్ల ద్వారానే అత్యధిక కలెక్షన్లు సాధించేందుకు నిర్మాతలు కూడా ప్లాన్ చేసుకుంటుంటారు. మరి ఈ ఏడాది ఓవర్సీస్‌లో విడుదలయిన సినిమాల్లో ఏ సినిమాకు అత్యధిక ప్రీమియర్ షో కలెక్షన్లు వచ్చాయో ఓ లుక్కేయండి. 

1. బాహుబలి-2
2. ఖైదీ నెం 150
3. స్పైడర్
4. జైలవకుశ
5. కాటమరాయుడు
 
బహుబలి2 ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా 2.45 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఖైదీ నెం150 సినిమా 1.29 మిలియన్ డాలర్లు సాధించింది. స్పైడర్ 1 మిలియన్ డాలర్లు, జైలవకుశ 5.89 లక్షల డాలర్లు, కాటమరాయుడు 4.90 లక్షల డాలర్లు వసూల్ చేసి తర్వాతి స్థానాల్లో నిలిచాయి.