2-Million-dollars-for-Agnyaathavaasi

2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అజ్ఞాతవాసి

నెగిటివ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లతో అజ్ఞాతవాసి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పవన్ కెరీర్లోనే అరుదైన చిత్రంగా నిలిచే రికార్డును అజ్ఞాతవాసి నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించి.. పవన్ కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను దాటిన సినిమాలు కేవలం ఎనిమిది మాత్రమే ఉండగా.. వాటిల్లో అజ్ఞాతవాసి చోటు సంపాదించింది.

సూపర్ హిట్ సినిమాలు వచ్చినా, బ్లాక్‌బస్టర్స్ చిత్రాలు థియేటర్లలో సందడి చేసినా.. ఓవర్సీస్‌లో కొన్ని సినిమాలకు మాత్రమే 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో ఈ మార్కును చేరుకున్న మొట్టమొదటి చిత్రం బాహుబలి-1 కాగా.. ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు కూడా 2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఈ రెండు సినిమాలు 2015లో విడుదలయినవే కావడం గమనార్హం. ఆ తర్వాత 2016లో వచ్చిన త్రివిక్రమ్ సినిమా అ..ఆ.., ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలు ఈ ఫీట్‌ను సాధించాయి. 2017లో వచ్చిన ఖైదీ నెం.150, బాహుబలి-2, ఫిదా సినిమాలు ఈ క్లబ్‌లోకి చేరుకున్నాయి. బాహుబలి-1, బాహుబలి-2 మినహా మిగిలిన 5 సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్‌ను పొంది 2 మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నాయి. కానీ అజ్ఞాతవాసి విషయానికి వస్తే.. నెగిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయి కలెక్షన్లతో 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అంతేకాకుండా మిగిలిన సినిమాలన్నీ లాంగ్‌రన్‌లో ఈ మార్కును చేరుకోగా అజ్ఞాతవాసి మాత్రం ఏడు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్లను దాటేసింది. 

ఓవర్సీస్‌లో 2మిలియన్ డాలర్ల సినిమాలు
1. బాహుబలి-2 ====== 20.77 మిలియన్ డాలర్లు
2. బాహుబలి-1 ====== 7.51 మిలియన్ డాలర్లు
3. శ్రీమంతుడు ====== 2.89 మిలియన్ డాలర్లు
4. అ..ఆ.. ====== 2.45 మిలియన్ డాలర్లు
5. ఖైదీ నెం.150 ====== 2.45 మిలియన్ డాలర్లు
6. ఫిదా ====== 2.07 మిలియన్ డాలర్లు
7. నాన్నకు ప్రేమతో ====== 2.02 మిలియన్ డాలర్లు
8. అజ్ఞాతవాసి  ====== 2 మిలియన్ డాలర్లు (రన్నింగ్)