ప్రపంచ స్థాయి సినీ అవార్డుల్లో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ రీల్ అవార్డుల రేసులో ‘2.ఓ’కు అరుదైన అవకాశం దక్కింది. 4డి సౌండ్‌ను పరిచయం చేస్తూ 3డిలో తెరకెక్కించిన ఈ చిత్రం ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో నామినేషన్ సాధించింది. 66వ గోల్డెన్ రీల్ అవార్డుల ప్రధానోత్సవం వచ్చే ఫిబ్రవరి 17వ తేదీన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరుగనుంది.
విదేశీ చిత్రాల్లో ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో ‘2.ఓ’ ఎంపికైంది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఓటింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 17వ తేదీన విజేతలను ప్రకటిస్తారు. కాగా, ‘2.ఓ’కు సౌండ్ డిజైనర్‌గా పనిచేసిన రసూల్ పూ కుట్టి ఇదివరకే ఆస్కార్ బిరుదును అందుకోవడంతో గోల్డెన్ రీల్ కూడా ఆయన ఖాతాలో చేరడం ఖాయమని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.