:: Welcome to NRI - Article ::

జబ్బు పేరుతో ఫేస్‌బుక్‌‌లో మోసం

స్నేహితులను మోసం చేసిన యువతి అరెస్టు 

హైదరాబాద్, బంజారాహిల్స్‌: కేన్సర్‌ బారిన పడ్డానని ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులను మోసం చేసిన యువతిని బంజారా హిల్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్‌కు చెందిన సమియా డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటోంది. ఆమె తండ్రి హుస్సేన్‌ సౌదీ అరేబియాలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తర చూ సమియా తండ్రి వద్దకు వెళ్లి నెలల కొద్ది అక్కడే ఉండి నగరానికి తిరిగి వస్తుంటుంది. రెండు సంవత్సరాల క్రితం హుస్సేన్‌కు కేన్సర్‌ రావడంతో సమియా అక్కడే ఉండిపోయింది. ఈ సమయంలో సౌదీలో చాలా మంది తో స్నేహం ఏర్పడింది. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం సౌదీ నుంచి తిరిగి వచ్చిన సమియా బంజారాహి ల్స్‌లోని ఓమేగా ఆసుపత్రి ఎండీ వంశీమోహన్‌ను కలి సింది. తన తండ్రికి ఉన్న రోగం గురించి చెప్పింది. చికి త్సకు ఎంత ఖర్చు అవుతుందని అడిగింది. రోగిని పరీక్షిం చాక చెబుతానని మోహన్‌ వంశీ బదులిచ్చారు. ఈ సమయంలో కొన్ని వైద్యుడితో సెల్ఫీలు తీసుకుంది.
  
తాను కేన్సర్‌ బారిన పడ్డట్టు ఫేస్‌బుక్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేసింది. డబ్బు లేక వైద్యం చేయించుకోలేకపోతున్నా అంటూ పేర్కొంది. ఇది నమ్మిన కొంత మంది బంధువులు స్నేహితులు ఆమె చికిత్స కోసం డబ్బు పంపించారు. అంతే కాకుండా కేన్సర్‌ బాధితులను ఆదుకునేందుకు వెలసిన స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయ పడ్డాయి. గత నెలలో తనకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని ఫెస్‌బు క్‌లో పోస్టు చేసింది. దీంతో సౌదీకి చెందిన ఇద్దరు స్నేహితులు ఆమెను పరామర్శించేందుకు నగరానికి వచ్చారు. ఆసుపత్రి వెళ్లి సమియా గురించి వాకబు చేయగా అలాంటి రోగి ఎవరూ లేరని సిబ్బంది సమా ఽధానమిచ్చారు. వారు సమియా ఫొటోలు చూపించగా సిబ్బంది గుర్తు పట్టారు. తన తండ్రి వ్యాధికి చికిత్స చేయించాలని వైద్యుడిని సంప్రదించినట్టు ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. సమియా మోసం గురించి భయపడ టంతో బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఆసుపత్రి ప్రతిష్ఠకు సమియా భంగం కలిగించేలా వ్యవహరించారని ఆసుపత్రి నిర్వాహకులు మరో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు సమియాను గురువారం అరెస్టు చేశారు. తన తండ్రి వ్యాధి వచ్చిందంటే ఎవరూ డబ్బు ఇవ్వరని అందుకే తనకు వ్యాధి వచ్చినట్టు నాటకమాడినట్టు సమియా చెప్పింది. దాదాపు 30 లక్షల రూపాయల మేర మోసానికి సమియా పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 

 

Loading...