:: Welcome to NRI - Article ::

సింగపూర్‌లో ఘనంగా యోగా దినోత్సవం

సింగపూర్‌: యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఈ నెల 21న జరుపుకోనుండగా.. సింగపూర్‌ మాత్రం ఆదివారమే నిర్వహించింది. దాదాపుగా 8వేల మందికి పైగా ఔత్సాహికులు ఇందులో పాల్గొని పలు యోగాసనాలు వేశారు. వీరితో పాటు స్థానిక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాతో ఒనగూరే ప్రయోజనాలను వక్తలు వివరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన పార్లమెంటేరియన్‌ గాన్‌ థియామ్‌ పోహ్‌ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా యోగా బాగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోం, లా మినిస్టర్‌ సహా భారత రాయబారి పాల్గొన్నారు.