worlds-most-powerful-passports-of-2018

2018లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే..

ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పాస్‌పోర్టులు అతి ముఖ్యమైనవి. ప్రయాణ సౌలభ్యమే కాకుండా కొన్ని పాస్‌పోర్టు స్వేచ్ఛను కూడా కల్పిస్తాయి. గ్లోబల్ సిటిజన్‌‌షిఫ్ అండ్ రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ ‘హెన్లే అండ్ పార్ట్‌నర్స్’ పాస్‌పోర్టులపై తన త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. ‘హెన్లే అండ్ పార్ట్‌నర్స్’ హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ -2018 ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులు తమ దేశంలోకి ప్రవేశించేందుకు 190 దేశాలు అనుమతిస్తున్నాయి.

తరువాత స్థానాల్లో నిలిచిన దేశాల వరుస క్రమం..

2. సింగపూర్. మొత్తం 189 దేశాలు సింగపూర్ పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులు వీసా లేకుండా లేదా వెంటనే వీసా పొందే సౌకర్యాన్ని కల్పిస్తూ దేశంలోకి అనుమతి ఇస్తున్నాయి. 
3. జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణకొరియా
2018 ప్రారంభంలో మొదటి స్థానంలో ఉన్న జర్మనీ తాజా రిపోర్టుల ప్రకారం ఫ్రాన్స్, దక్షిణకొరియాలతో కలిసి మూడవ స్థానాన్ని పంచుకుంటోంది. మొత్తం 188 దేశాలు పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులను  అనుమతినిస్తున్నాయి).
4. డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, స్విడన్, స్పెయిన్(ఈ దేశాల పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులను 187 దేశాలు అనుమతిస్తున్నాయి).
5. నార్వే, యూకే, ఆస్ట్రియా, లగ్జెంబర్గ్, నెథర్‌లాండ్స్, పోర్చుగల్, యూఎస్(ఈ దేశాల పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులను 186 దేశాలు అనుమతిస్తున్నాయి).
6. కెనడా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, బెల్జీయం(ఈ దేశాల పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులను 185 దేశాలు అనుమతిస్తున్నాయి).
7. ఆస్ట్రేలియా, గ్రీస్, మాల్టా(ఈ దేశాల పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులను 183 దేశాలు అనుమతిస్తున్నాయి).
8. చెక్ రిపబ్లిక్, న్యూజీలాండ్(ఈ దేశాల పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులను 182 దేశాలు అనుమతిస్తున్నాయి).
9. ఐస్‌లాండ్(ఈ దేశాల పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులను 181 దేశాలు అనుమతిస్తున్నాయి).
10. హంగేరి, స్లొవేనియా, మలేసియా(ఈ దేశాల పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులను 180 దేశాలు అనుమతిస్తున్నాయి).