women-wants-kill-her-husband-

భర్తను చంపాలని ప్రయత్నించిన భార్య చివరికి..

వాషింగ్టన్: భర్తను చంపాలని ఓ భార్య కిరాయి హంతకుడిని నియమించింది. అంతకు ముందే మూడుసార్లు ఆయన్ని చంపాలని ప్రయత్నించి విఫలమయింది. దాంతో ఈ సారి ఎలాగైన చంపేయాలనుకుంది. కిరాయి హంతకుడికి భారీ మొత్తంలో డబ్బులిచ్చింది. ఆధారాలు దొరకుండా పని ముగించాలని హంతకుడిని ఆదేశించింది. అయితే ఆమె అనుకున్నట్లు జరగలేదు. ఆమె భర్తను చంపేందుకు ప్రయత్నించిన హంతకుడు పోలీసులకు దొరికిపోయాడు. వారి విచారణలో విషయం మొత్తం చెప్పేశాడు. భర్త పేరుతో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బును చేజిక్కించుకునేందుకు ఆమె ఈ పని చేసిందని పోలీసులు తెలిపారు. హంతకుడు చెప్పిన ఆధారాలతో పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కూడా విచారించారు. హంతకుడిని నియమించక ముందే మూడుసార్లు వివిధ రకాలుగా తన భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించానని తెలిపింది. మొదట విషం పెట్టి చంపేందుకు ప్రయత్నించానని చెప్పింది. అప్పుడు తప్పించుకున్నాడంది. తరువాత కరెంటు షాక్ పెట్టి చంపాలని చూశానని ఆమె తెలిపింది. అలాగే మూడో సారి భవనంపై నుంచి తోసి చంపాలని ప్రయత్నించానని తెలిపింది.