women-teacher-arrested-

మహిళా టీచర్.. ఇద్దరు విద్యార్థులతో..

చికాగో: ఓ మహిళ టీచర్ తన దగ్గర ఫుట్‌బాల్ శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఆమె వారితో తరచూ శృంగారంలో పాల్గొనేదని విద్యార్థులు తెలిపారు. అయితే రెండేళ్లుగా ఆమె వారితో సంబంధాన్ని కొనసాగిస్తున్నా కూడా ఎవ్వరికీ తెలియలేదు. ఈ ఘటన విరోన్ హిల్స్ ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్కూల్‌కెళ్లి విచారణ జరిపారు. విచారణలో ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. కోరి బ్రెడ్(28) అనే మహిళ టీచర్‌ను ఫుట్‌బాల్ కోచ్‌గా స్కూల్ యజమాన్యం నియమించింది. మూడు సంవత్సరాల క్రితం ఆమె నియామకం జరిగిందని పోలీసులు తెలిపారు. బాలురకు, బాలికలకు ఆమె కోచ్ అని వారు అన్నారు. అయితే ఇద్దరు విద్యార్థులతో కోరి చాలా ఫ్రెండ్లీగా ఉండేదని తోటి విద్యార్థులు తెలిపారు. కోరి వారిని తన ఇంటికి కూడా తీసుకెళ్తుండేదని వారు చెప్పారు. అయితే ఎవ్వరూ వారి సంబంధాన్ని అనుమానించలేదు. నిజం ఎక్కువ రోజులు దాగదు. ఆదివారం కోరితో సంబంధం ఉన్న విద్యార్థి మోబైల్ ఫోన్‌ను అతడి తండ్రి చూశాడు. అందులో కోరి అసభ్యకర ఫోటోలు కనిపించాయి. దాంతో అతడు స్కూల్ యజమాన్యానికి సమాచారం అందించాడు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. పోలీసులు కోరి నిందితురాలిగా తేల్చారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు.