women-sentenced-to-death-for-killing

6 ఏళ్ల పాపను చంపిన మహిళకు మరణశిక్ష విధించి..

రియాద్: ఆరేళ్ల పాపను హత్య చేసినందుకు సౌదీ కోర్టు అయిదా బింట్ షామన్ అల్ రషీదీ అనే మహిళకు మరణశిక్ష విధించింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు ఇటీవల ఓ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే అతడికి భార్య, కూతురు ఉన్నారు. రీమ్ బింట్ ఫరాగ్(6) అతడి మొదటి భార్య కూతురు. ఆ పాపపై నిందితురాలు కక్ష కట్టింది. పథకం ప్రకారమే నిందితురాలు పాపను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. స్కూల్ నుంచి అప్పుడే వచ్చిన రీమ్‌ను తన వెంట తీసుకెళ్లి అయిదా కత్తితో గొంతు కోసి చంపిందని పోలీసులు చెబుతున్నారు. కూతురు కనిపించకపోవడంతో అంతా వెతికారు. ఓ చోట రక్తం మరకలు కనిపించడంతో అనుమానించి నిందితురాలిని కుటుంబసభ్యులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు.