women-released-from-jail-

జైలు నుంచి విడుదలైన ఆసియాబీబీకి యూరోప్ దేశాల బాసట

ఇస్లామాబాద్/వాషింగ్టన్: దైవదూషణ కేసులో పాకిస్థాన్ జైలు నుంచి విడుదలైన క్రైస్తవ మహిళ ఆసియాబీబీకి యూరోప్ దేశాలు బాసటగా నిలిచాయి. ముల్తాన్ మహిళా జైలు నుంచి విడుదలైన ఆసియాబీబీకి తాము ఆశ్రయం కల్పిస్తామని ఇటలీ, రోమ్ దేశాలు ప్రకటించాయి. ఆసియాబీబీ 2010లో ముగ్గురు ముస్లిమ్ మహిళలతో వాగ్వాదానికి దిగి ఇస్లామ్ ను అగౌరవపర్చింది. దీంతో ఆసియాబీబీకి దైవదూషణ కేసులో కింది కోర్టు మరణ దండన విధించింది. కాని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆసియాబీబీ కేసును కొట్టివేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవ మహిళ ఆసియాబీబీ దైవాన్ని దూషించిందని ఆమెకు మరణదండన విధించాలని కొన్ని ముస్లిమ్ సంఘాలు డిమాండ్ చేశాయి. జస్టిస్ నిస్సార్, జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా, జస్టిస్ మజహర్ ఆలంఖాన్ ల ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తూ ఆసియాబీబీని జైలు నుంచి విడుదల చేయాలని తీర్పునిచ్చారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆసియాబీబీని జైలు నుంచి విడుదల చేశామని జైలు అధికారులు చెప్పారు.ఆసియాబీబీతోపాటు ఆమె భర్త ఆషిఖ్ మాసిహ్ కు తాము సహకారం అందిస్తామని రోమ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆసియాబీబీకి తాము మానవతా దృక్ఫథంతో ఆశ్రయం కల్పిస్తామని ఇటలీ డిప్యూటీ ప్రధానమంత్రి మట్టో సాల్విని చెప్పారు. గతంలో ఆసియా బీబీకి శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని ఆమె భర్త యూకే, అమెరికా, కెనడా దేశాలను అభ్యర్థించాడు.