women-posting-abusive-videos-

సోషల్ మీడియాలో వీడియోలు.. ఓ మహిళ చేయకూడని పని..

దుబాయ్: నీతి బాహ్యమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తోన్న మహిళను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం గత సంవత్సరం డిసెంబర్ నుంచి సోషల్ మీడియాలో ఓ మహిళ తీవ్ర అభ్యంతరకర వీడియోలు పోస్టు చేస్తోందని పోలీసులు కనిపెట్టారు. ఆమెను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వివిధ సోషల్ మీడియా సైట్లల్లో వివిధ పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేయడంతో ఆమెను గుర్తించడం కష్టమైందని పోలీసులు తెలిపారు. చివరికి సైబర్ నిపుణుల సాయంతో అరెస్ట్ చేయగలిగామని వారు చెప్పారు. ఓ మహిళ అయి ఉండి ఆమె చేస్తోన్న పనుల గురించి తెలిసి న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారని పోలీసులు చెప్పారు. ఆమెకు ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు 2లక్షల 50 దిర్హమ్స్(దాదాపురూ.43లక్షలు) జరిమానాగా చెల్లించాలని తీర్పు చెప్పారని పోలీసులు చెప్పారు.