Woman-in-UAE-receives-surprise-phone-call

ఓ మహిళకు దుబాయ్ యువరాజు సర్‌ప్రైజ్ ఫోన్ కాల్...

అబుదాబి: సాధారణంగా అధికారం చేతుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు గర్వంగా ప్రవర్తిస్తుంటారు. సామాన్య ప్రజలకు కనీస మర్యాద కూడా ఇవ్వరు. అయితే అబుదాబి యువరాజు షేక్ మహ్మాద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ మాత్రం అలాంటి వారు కాదు. ఇటీవల యువరాజు ఎమిరెట్స్ యూనివర్సిటీని సందర్శించారు. ఆ సమయంలో ఆయనను ఓ విద్యార్థి కలిసింది. దాదాపు 80ఏళ్ల వయసున్న తన నాన్నమ్మ యువరాజుతో ఒక్కసారైన మాట్లాడాలని కలలు కంటోందని విద్యార్థి యువరాజుకు చెప్పింది. వెంటనే యువరాజు నాన్నమ్మకు ఫోన్ చేయమని విద్యార్థికి సూచించారు. విద్యార్థి ఫోన్ కాల్ చేసి యువరాజు చేతికిచ్చింది. ఆ పెద్దావిడతో యువరాజు మాట్లాడారు. ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. సామాన్య విద్యార్థి అడిగిన వెంటనే యువరాజు స్పందించారని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. యువరాజుపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.