Winter-storm-hits-northeast-US

2,500 విమానాలు రద్దు

వాషింగ్టన్: ఈశాన్య అమెరికాను శీతల తుఫానులు వణికిస్తున్నాయి. ఇప్పటికే ఓ తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపించగా ఇదే వారంలో మరో శీతల ఏర్పడింది. ఈ తుఫాను కారణంగా అమెరికా ఈశాన్య ప్రాంతాలు మంచుతో వణికుతున్నాయి. జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా కురుస్తున్న మంచు రోడ్డు, చెట్లపై భారీగా పేరుకుపోతోంది. కురుస్తున్న మంచుకు గాలి తోడవ్వడంతో కఠిన శీతల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కఠిన వాతావరణ పరిస్థితుల కారణంగా 2,500 విమానాలు రద్దయ్యాయి. వందల సంఖ్యలో విమాన సర్వీసులు వాయిదాపడ్డాయి. మంచు కారణంగా అనేక ఎయిర్‌పోర్టులు మూతపడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బోస్టన్, ఫిలిడెల్ఫియా, న్యూజెర్సీ, న్యూయార్క్‌లతోపాటు పలు నగరాల్లోని విమానాశ్రయాలు సేవలు అందించలేకపోతున్నాయి. స్కూల్స్, కార్యాలయాలు తెరిచేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.