Wife-suicide-in-Home-while-husband-in-Bahrain

బహ్రెయిన్‌లో భర్త.. హైదరాబాద్‌లో భార్య ఆత్మహత్య

అత్తింటి వేధింపులు భరించలేక గృహిణి బలవన్మరణం

మదీన, హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అత్త, ఆడపడుచుల వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య  చేసుకుంది. ఈ ఘటన కామాటిపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం..  పహాడిషరీఫ్‌ వాదియె సాలెహీన్‌ బస్తీకి చెందిన యూనుస్‌ కుమార్తె సబా బేగం (25)ను మిస్రిగంజ్‌ గుల్షన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ షకీల్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. షకీల్‌ ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం బహ్రెయిన్‌ వెళ్లాడు. అప్పటి నుంచి సబా బేగం అత్తారింటిలోనే ఉంటోంది. ఆమె ఆడపడుచులు ఇద్దరు కూడా వారి ఇంటి పక్కనే నివసిస్తున్నారు. షకీల్‌ వెళ్లినప్పటి నుంచి అత్త, ఆడపడుచులు సబాబేగంను వేధించడం ప్రారంభించారు. వారి వేధింపులు అధికమవడంతో బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.